ట్రైలర్ …ఆ హాలీవుడ్ సినిమా కు కాపీలా ఉందే!?

రీసెంట్ గా సుబ్రమణ్యపురం చిత్రంతో పలకరించిన సుమంత్ …మరో చిత్రంతో రెడీ అయ్యిపోయారు. ఆయన నటిస్తున్న ఓ వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తూంటే చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. అయితే హాలీవుడ్ లో వచ్చిన Nightcrawler కు నకలు గా అనిపిస్తోంది. మీరూ ట్రైలర్ చూసి ఓ నిర్ణయానికి రండి.

Idam Jagath Trailer || Sumanth || Anju Kurian || Anil Srikantam

నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా హీరో సుమంత్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రలో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విభిన్నమైన ఆ పాత్ర ఆడియన్స్‌కు థ్రిల్‌ను కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చెయ్యబోతున్నాడు. ట్రైలర్ ర్ బాగుందంటూ ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్ చేస్తుంటే ఆనందంగా ఉంది. సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది..’’ అన్నారు.