ఇది నాని సినిమానే అంటున్నారా?.. ‘V’ రూమర్లపై సుధీర్ బాబు అసహనం

Sudheer Babu Over Rumors On Nani Role Importance In V Movie

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌ బాబులు ముఖ్య పాత్రలో పోషించిన చిత్రం V. ఈ సినిమాపై మొదటినుంచి సోషల్ మీడియాలో ఓ రకమైన ప్రచారం జరుగుతోంది. ఇది నాని 25వ చిత్రమని, కేవలం నానినే ఫోకస్ చేస్తున్నారని, ఇది నాని చిత్రమేనని సుధీర్‌ బాబును తక్కువ చేసినట్టుగా ఓ ప్రచారం జరగుతోంది. అయితే ఈ డైరెక్టర్ నాని(అష్టాచమ్మా, జెంటిల్‌మెన్), సుధీర్ బాబు( సమ్మోహనం)లకు హిట్స్ ఇచ్చి ఉన్నాడు.

Sudheer Babu Over Rumors On Nani Role Importance In V Movie
Sudheer Babu Over Rumors On Nani Role Importance In V Movie

ఈ సారి కొత్తగా ఈ ఇద్దరిని పెట్టి తీశాడు. అందులో నాని సీరియల్ కిల్లర్, సైకో పాత్రను పోషిస్తున్నాడు. ఇక సుధీర్‌ బాబు నిజాయితీ గల పోలీసాఫీసర్ పాత్రలో నటించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నింటిలోనూ ఇద్దరికీ సరి సమానమైన షేర్ ఇచ్చినా సరే సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజా ఇంటర్వ్యూలో సుధీర్‌ బాబు వద్ద కూడా ఇలాంటి ప్రశ్నలు సంధించడంతో కాస్త వెరైటీగా సమాధానం ఇచ్చాడు.

V Movie
V Movie

ఇది ఇద్దరి పాత్రల చుట్టూ తిరిగే కథ. బలమైన ఇద్దరు వ్యక్తుల ఢీ కొడితే ఎలా ఉంటుందో చూపించేదే V చిత్రం. బయట వినిపించే మాటలు అంతగా పట్టించుకోను. అయినా సినిమా చూశాక మీకే తెలుస్తోంది. ఎవరి పాత్ర ఎంత ఉంది? ఎవరు ఎలా చేశారు? ఎవరికి పేరు వస్తుంది? అని సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అంటూ సుధీర్‌ బాబు ఓ క్లారిటీ ఇచ్చాడు. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.