‘మన్మథుడు-2’ : హైదరాబాద్ లో ఇంకో రకం టార్చర్

‘మన్మథుడు-2’ : హైదరాబాద్ లో సబ్ టైటిల్స్ తో నరకం 

ఈ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున కెరీర్ చెప్పుకోదగినంత గొప్పగా సాగట్లేదు. వరుస ఫెయిల్యూర్లతో ఆయన రేసులో బాగా వెనుకబడ్డాడు. ఈ స్థితిలో ‘చి ల సౌ’తో డైరక్టర్ గా లాంచ్ అయిన నటడు రాహుల్ రవీంద్రన్ తో కలిసి ఆయన చేసిన సినిమా ‘మన్మథుడు-2’. నాగ్ కెరీర్ లో కల్ట్ మూవీగా నిలిచిన ‘మన్మథుడు’ టైటిల్ వాడుకోవడంతో ఈ సినిమాపై సినిమా వర్గాల్లో, సినీ లవర్స్ లో స్పెషల్ ఇంట్రస్ట్ నెలకొంది. ఈ చిత్రం టీజర్ – ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. చెప్పుకోదగ్గ ఎక్సపెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మాత్రం అందుకోలేక చతికిలపడింది.

ఆ విషయం ప్రక్కన పెడితే అసలే సినిమా అంతంత మాత్రం అనుటుంటే…ఈ సినిమా హైదరాబాద్ మల్టి ఫ్లెక్స్ జనాలకు ఇంకో తలనొప్పి ని మిగిల్చాయి. ఓవర్ సీస్ ప్రేక్షకులు వేసే సబ్ టైటిల్స్ వెర్షన్ ఇటు వచ్చేసిందో ఏమో కానీ, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ తెలుగు సినిమాని చూడాల్సి వచ్చింది. అదో పెద్ద ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఈ ఇబ్బంది మొదలైందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పడ్డాయి.

ఇక ప్లేబాయ్ పాత్రలో ప్రవేశించటానికి నాగ్ ఎంతగా ప్రయత్నించినా కూడా ఆయన వల్ల కాలేదు. వయసు లుక్స్ కారణంగా చాలా వరకు కృత్రిమంగా, ఇబ్బందిగానే అనిపించింది. దీంతో మొదట్నుంచే ఆ పాత్రతో నాగ్ ని అంతగా కనెక్ట్ కాలేం. దానికి నాగ్ కు మొదటి నుంచి ఫ్యామిలీ ప్రేక్షకుల అండ ఉంది. దాన్ని చెడకొట్టేలా.. చాలా వరకు అడల్ట్ డోస్ ఉన్న డైలాగులు – సన్నివేశాలతో కథను నడిపించాడు రాహుల్. అడల్ట్ డోస్ బాగా దట్టించి రాసిన కొన్ని డైలాగులు.. దెబ్బకొట్టాయి. వెన్నెల కిషోర్.. రావు రమేష్ ల కామెడీ మినహాయిస్తే ‘మన్మథుడు-2’లో చెప్పుకోదగ్గ విశేషాలే లేకపోయాయి.