250 ఎకరాల్లో.. రాజమౌళి కొడుకు వెడ్డింగ్ వెన్యూ

రీసెంట్ గా జగపతిబాబు అన్నయ్య రాంప్రసాద్‌ కూతురు పూజ ప్రసాద్‌కి రాజమౌళి కొడుకు కార్తికేయకు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఉత్సాహంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కార్తికేయ, పూజల వివాహానికి జైపూర్ వేదిక కానుంది. డిసెంబర్ 30న వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ‘బాహుబలి’ సెట్ స్దాయిలో వివాహ వేదికను నిర్మించనున్నట్టు సమాచారం. జైపూర్‌లోని ప్యారామౌంట్ హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

250 ఎకరాల్లో కట్టిన 7స్టార్ లగ్జరీ హోటల్ ప్యారామౌంట్ మొగల్ స్టైల్ ప్యాలెస్‌ని తలపించే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు ఎంపిక చేసిన సెలబ్రెటీస్ హాజరుకాబోతున్నారని సమాచారం.

రాజమౌళి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన `ఈగ` సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా , నాగచైతన్య..`యుద్ధం శరణం` సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా `బాహుబలి-2`కు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేసిన కార్తికేయ ఆల్ రౌండర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక రెస్టారెంట్ కు సహ యజమానిగా ఉన్న కార్తికేయ….తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ లో నల్గొండ ఈగల్స్ కబడ్డీ టీమ్ కు ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు.