‘దేవ‌దాస్’:డైరక్టర్ తప్పేమీ లేదంటూ వాళ్లపై తోసేస్తున్నారు

నాని, నాగార్జున హీరోలుగా దర్శకుడు శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన చిత్రం “దేవ‌దాస్”. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌లైంది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తొలి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. శుక్రవారం అంటే నిన్నే చాలా చోట్ల కలెక్షన్స్ పడిపోయాయని ట్రేడ్ టాక్. నాని, నాగ్ బాగానే సినిమాకు పనిచేసినా దర్శకుడు స్క్రిప్టు వర్క్ సరిగ్గా చేయకపోవటం, శ్రద్ద పెట్టకపోవటమే దెబ్బ తీసిందని అంతా అనేసారు. ఇదే దర్శకుడు డైరక్ట్ చేసిన శమంతకమణి సినిమాకు అదే సమస్య. దాంతో ఈ టాక్ డైరక్టర్ కెరీర్ ని దెబ్బ తీస్తుందని, ఈ సినిమా

ఈ నేఫధ్యంలో ఆ దర్శకుడు ఫేవర్ గా ఉండే  కొన్ని వెబ్ మీడియా సంస్దలు ఈ సినిమా ప్రభావం..దర్శకుడు కెరీర్ పై పడకుండా ఓ కొత్త ప్రచారం మొదలెట్టాయి. ఈ సినిమాని ఎడిటింగ్ టేబుల్ దగ్గరే చంపేసారని వాళ్లు చెప్తున్నారు. ఇద్దరు హీరోలు వచ్చి తమదైన సూచనలు సలహాలు ఎడిటర్ కు ఇచ్చేవారని, అంతేకాకుండా నిర్మాతలు అశ్వనీదత్, ప్రియాంక,స్వప్న కూడా ఎడిటర్ కు సూచనలు చేసేవారు.

ఎవరికి వాళ్లు చెప్పిన సూచనలు వల్ల సినిమాలో ఉన్న సమస్యలు పోవటం మాట అటుంచి, కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయని ,లింక్ లు తెగిపోయాయని ,ముఖ్యంగా సినిమా రిలీజ్ కు ముందు కొన్ని సీన్స్ తీసేసారని అలా ..సినిమాని ట్రిమ్ చేయటం నాశనం చేసిందని, డైరక్టర్ కన్నా అందరూ సీనియర్స్ కావటంతో ఏం చేయలేకపోయాడని, అతని తప్పేమి లేదని అంటున్నారు.  అయితే ఈ ప్రచారం డైరక్టర్ కు ఎంతవరకూ పాజిటివ్ గా ఉపయోగపడుతుందో చూడాలి. ఏదైనా సినిమా చీదిందంటే డైరక్టర్ నే అంటారు అనేది మాత్రం సినీ సత్యం.