‘ఇస్మార్ట్ శంకర్’ సోమవారం పరిస్దితి ఏంటి?!

‘ఇస్మార్ట్ శంకర్’ సోమవారం పరిస్దితి ఏంటి?!

ఈ మథ్య కాలంలో పక్కా మాస్‌ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ఏదీ రాలేదు. ఆ లోటుని ఇస్మార్ట్‌ శంకర్‌ తీరుస్తోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే కలెక్షన్స్ దుమ్ము దులిపేసి, సేఫ్‌ జోన్‌లోకి ఎంటర్‌అయిపోయింది. అయితే సోమవారం నుంచే ఎంత పెద్ద హిట్ సినిమాకి అయినా పరీక్ష. సినిమా స్టామినాని బట్టి పాసైందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అందుతున్న సమచారం బట్టి వీకెండ్ పూర్తైన తర్వాత వచ్చిన సోమవారం 2.17 కోట్లు సంపాదించింది. దాంతో కొద్దిగా డ్రాప్ కనపడినట్లైంది. అయితే అది చాలా కామన్ అంటున్నారు ట్రేడ్ లో . కాబట్టి వర్రీ కావాల్సిన పనిలేదని చెప్తున్నారు.

హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌.. ఇద్దరూ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇస్మార్‌ శంకర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా రామ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో కొత్త క్యారెక్టర్‌లో చూపించాడు పూరి. ట్రైలర్‌లు, సాంగ్స్‌ సినిమాకు మాస్‌ ఇమేజ్‌ తీసుకువచ్చాయి. ఆ అంచనాలను ఇస్మార్ట్‌ శంకర్‌ అందుకోవటం కలిసొచ్చింది.

మరీ ముఖ్యంగా పూరి హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజిలో ఇస్మార్ట్ శంకర్ పేలింది.వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించటం ట్రేడ్ కు షాక్ ఇస్తోంది.