అందాల రాక్షసి.. రక్కేస్తానంటోన్న సితార

Sitara Ghattamaneni Cute Pic Goes viral

మహేష్ బాబు వెండితెరపై ఎంత ఫేమస్సో.. ఎంతటి స్టార్డం ఉందో.. సితారకు సోషల్ మీడియాలో అంతటి ఫాలోయింగ్ ఉంటుంది. సితార పాట పాడినా, కాలు కదిపినా, చిన్నగా మాట్లాడినా కూడా ఎంతగానో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలా సితార సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. లాక్డౌన్‌లో నెటిజన్లను సితార ఎంతగా ఎంటర్టైన్ చేసిందో అందరికీ తెలిసింది.

Sitara Ghattamaneni Cute Pic Goes viral
Sitara Ghattamaneni Cute Pic Goes viral

సితార చిన్ననాటి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నమ్రత రచ్చ చేసింది. మహేష్ బాబు సినిమాలకు షూటింగ్ లొకేషన్లలో సితార చేసిన అల్లరి, వేసిన డ్యాన్సులు ఇలా ప్రతీ ఒక్కటి షేర్ చేస్తూ నమ్రత సోషల్ మీడియాను షేక్ చేసింది. సితార కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో బాగానే బిజీగా ఉంటుంది. ఆ మధ్య అయితే వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేసేది. కానీ ఈ మధ్య సింగిల్‌ను షేక్ చేస్తోంది.

క్యూట్ క్యూట్ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సితార పాపను అందరికీ ముచ్చటేస్తుంది. మామూలుగా ఉంటేనే సితార పాప ఎంతో క్యూట్‌గా ఉంటుంది. అలాంటి కోతి చేష్టలు, రాక్షసిలా చేస్తుంటే ఇంత క్యూట్‌గా ఉంటుందా? అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా సితార ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో రక్కేస్తా అన్నట్టుగా ఓ పోజును పెట్టేసింది. దీంతో అందరూ అందాల రాక్షసి అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.