గుత్తా జ్వాలా ప్రేమ‌లో త‌రిస్తున్న సింగిల్ హీరో

                          బ్యాడ్మింట‌న్ ప్రేమ‌లో సినిమా.. పొగ‌రైన‌ పందెంకోళ్లు

క్రికెట‌ర్లు హీరోయిన్ల‌ను పెళ్లాడ‌డం ప‌ర‌మ రొటీన్. క్రీడాకారిణులు హీరోల్ని పెళ్లాడ‌డం అన్న‌ది కొత్తేమీ కాదు. క్రీడ‌లు.. సినిమా ప్ర‌పంచంలో ఉన్న గ్లామ‌ర్ మ‌త్తు అలాంటిది. ఆ ఇరు రంగాల్లో హై ప్రొఫైల్ స్నేహాలు ప్రేమ‌కు దారి తీయ‌డం.. అటుపై పెళ్లాడేయ‌డం నిరంత‌రం చూసేదే.

ఇక‌పోతే ఇప్ప‌టికే పెళ్ల‌యి విడాకుల‌తో ఒంట‌రి అయిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ జ్వాలా గుత్తా ప్రేమాయ‌ణం గ‌త రెండు మూడేళ్లుగా హాట్ టాపిక్ గా మారింది. త‌మిళ హీరో విష్ణు విశాల్ తో జ్వాలా గుత్తా నిండా ప్రేమ‌లో ఉంద‌ని .. ఆ ఇద్ద‌రూ ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేక‌పోతున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప‌లుమార్లు డిన్న‌ర్ డేట్లు లంచ్ లు అంటూ కెమెరా కంటికి చిక్క‌డంతో అస‌లు ర‌భ‌స మొద‌లైంది. అయితే త‌మ మ‌ధ్య అనుబంధాన్ని ఆ ఇద్ద‌రూ ఖండించ‌నూ లేదు. అంగీక‌రించ‌నూ లేదు. అలా స‌స్పెన్స్ లో ఉంచ‌డంతోనే అస‌లు స‌మ‌స్య‌.

అభిమానుల‌కు ఏది నిజం.. ఏది భ్ర‌మ అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. తాజాగా విష్ణు విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ్వాలా గుత్తా అత‌డికి స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. నేరుగా చెన్న‌య్ లోని అత‌డి ఇంటికే వెళ్లి ఇలాంటి క‌రోనా వేళ ఊహించ‌ని షాక్ నిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోని కూడా విష్ణు స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశాడు. స్నేహితుడి చెంత‌నే ఉండి బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేయించి జ్వాలా గుత్తా గారాలు పోతున్న ఫోటో ప్ర‌స్తుతం వేడి పెంచేస్తోంది. అత‌డంటే నిజంగా అంత ప్రేమా? అయితే పెళ్లెప్పుడు. అంటూ అప్పుడే సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ ప్ర‌శ్నల్ని సంధిస్తున్నారు. మ‌రి ఈ ప్రశ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు జ్వాలా కానీ.. విష్ణు విశాల్ కానీ సిద్ధంగా ఉన్నారా?   విష్ణు విశాల్ టాలీవుడ్ హీరో రానాకు చాలా క్లోజ్. ప్ర‌స్తుతం త‌మిళంలో బిజీ హీరో. అత‌డు జెర్సీ రీమేక్ లోనూ న‌టిస్తున్న సంగ‌తి విధిత‌మే. ఈ చిత్రాన్ని రానా నిర్మిస్తున్నాడు.

https://twitter.com/TheVishnuVishal/status/1283852983717916672/photo/1