షాకింగ్ : “ఆచార్య” నష్టాలు..కొరటాలకి బెదిరింపులు, నెక్స్ట్ మెగాస్టార్ కే?

Acharya Buyers

ఈ ఏడాది టాలీవుడ్ లో ఘోరమైన ప్లాప్ సినిమా ఏదన్నా ఉంది అంటే మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు నటించిన అవైటెడ్ మెగా మాస్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” అనే చెప్పాలి. ఒక్క ఈ ఏడాదిలోనే కాకుండా ఆల్ టైం బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. 

అయితే ఈ సినిమా నష్టాలు మిస్టరీ మాత్రం అలా కొనసాగుతూనే వస్తుంది. ఆ మధ్య ఎన్నో వెర్షన్ లు వినిపించాయి కానీ చాలా ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా నష్టాలు చెల్లించలేదట. దీనితో తమ కోట్లాది రూపాయలు ఎప్పుడు వెనక్కి తిరిగి ఇస్తారని డిమాండ్ చేస్తున్నారట. 

అంతే కాకుండా తాజాగా అయితే కొందరు డిస్ట్రిబ్యూటర్లు కొరటాలకి బెదిరింపులు కూడా ఇస్తున్నారట. ఆల్రెడీ కొరటాల ఆఫీస్ దగ్గర బైఠాయించారని కొరటాల సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారట. అలాగే ఇది కానీ సాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ చిరంజీవితోనే తేల్చుకుంటామని చెబుతున్నారట. 

దీనితో ఈ షాకింగ్ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. మరి దీనిపై అయితే ఎప్పుడు ఒక క్లారిటీ వస్తుందో చూడాలి. ఇంకా ఈ సినిమాని రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి లు నిర్మాణం వహించగా పూజా హెగ్డే రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.