స్టార్ హీరోయిన్ రెజీనా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం సాగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ నేషనల్ న్యూస్ మ్యాగజైన్ రెజీనా నిశ్చితార్థం గురించి వార్తలు ప్రచురించడం వైరల్‌గా మారింది. ఈ నెల 13న చెన్నైలో కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో రెజీనా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని పేర్కొంది.
అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారని రాసింది. అయితే ఎవరితో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ వివరాలు ఏమీ వెల్లడించలేదు.నిన్నటినుంచి ఈ వార్త కాస్తా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే రెజీనా మాత్రం దీని గురించి ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు.
రీసెంట్ గా విడుదలైన ‘7’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక ఆమె వివాహం జరిగే అవకాసం ఉందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.