సెలబ్రిటీల పెళ్లిళంటే ఎన్నో ఆసక్తికర సంగతులుంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా…పెద్దల కుదర్చిన సంబంధం అయినా కెలికితే బోలెడంత మ్యాటర్ ఉంటుంది. ముఖ్యంగా పెద్దల కుదిర్చిన పెళ్లి వెనుక చాలా విషయాలుంటాయంటారు. తాజాగా మెగా డాటర్ నిహారిక పెళ్లి కోడుకు విషయంలోకి తొంగి చూస్తే ఆసక్తికర సంగతులే బయటకు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజమో! తెలియదు గానీ! మ్యాటర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
నిహారికను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ కుమారుడు చైతన్యకిచ్చి వివాహం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మరి ఈ సంబంధం ఎలా కుదిరింది? దీని వెనుక ఉన్న వారు ఎవరు? అంటే ఆసక్తికర విషయాలు లీకయ్యాయి. నిహారిక కాబోయే మామగారు ప్రభాకర్ రావు కు ఓ చెల్లులు ఉండేవారుట. ఆమెను 30 ఏళ్ల కిందట చిరంజీవి నాగబాబుకు ఇచ్చి చేయాలనుకున్నారుట. ఇరు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయట. కానీ ఎందుకనో చివరి నిమిషంలో నిర్ణయాలు మారాయట. అలాగని ఆ రెండు కుటుంబాల మధ్య మాటలు లేకపోవడం లాంటింది లేదుట.
బంధువులు కాకపోయినా స్నేహితుల్లా అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాలు టచ్ లోనే ఉన్నాయట. ఇక నిహారిక పెళ్లి విషయాన్ని నాగబాబు అన్నయ్య చిరంజీవి దృష్టికి తీసుకెళ్లగానే మంచి సంబంధం చూద్దాం..కంగారు పడొద్దన్నారుట. అలా ఆలోచనలో పడ్డ చిరుకు ఒకరోజు ప్రభాకర్ రావు కుటుంబం తట్టిందిట. గతంలో కలిసినప్పుడు ఓసారి ప్రభాకర్ కుమారుడు చైతన్యని చూసిన గుర్తుకు వచ్చిందిట. కుర్రాడు బాగుంటుంటాడు..ఎప్పటి నుంచో తెలిసిన కుటుంబం అని భావించి ఇదే విషయాన్ని నాగబాబుకు చెప్పారుట. దీంతో నాగబాబు వెంటనే ఒకే అనేసారుట. అన్నయ్య మాటను మెగా బ్రదర్ కాదన్నది ఎప్పుడూ. అన్నదమ్ముల కాపురాలు వేరే వేరు అయినా ఇలాంటి విషయాల్లో తీసుకున్నే నిర్ణయాలు కలిసి కట్టుగానే ఉంటాయి కదా. అలా 30 ఏళ్ల కిందట కోల్పోయిన బంధుత్వాన్ని నిహారిక ఇప్పుడిలా కలుపుతుంది.