` స‌వ్య‌సాచి` రిలీజ్ డేట్‌..?

                                                               (ధ్యాన్)                                                   

నాగ‌చైత‌న్య అక్కినేని, చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `స‌వ్య‌సాచి`. ప్రేమ‌మ్ వంటి స‌క్సెస్ త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్ర‌మిది. ఈ సినిమాను ముందుగా ఆగ‌స్ట్ చివ‌రి వారం లేదా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో విడుద‌ల చేస్తార‌నే వార్త‌లు వినిపించాయి. అయితే ఆగ‌స్ట్ 31న చైత‌న్య న‌టించిన `శైలజా రెడ్డి అల్లుడు` విడుద‌ల‌వుతుంది. అందువ‌ల్ల ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. న‌వంబ‌ర్ 7న దీపావ‌ళి సంద‌ర్బంగా.. మూవీ విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, భూమిక ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.