మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేందురు మరో కారణం

 ‘సరిలేరు నీకెవ్వరూ’ టైటిల్ సాంగ్ వీడియో

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో మహేష్  పాత్రను పరిచయం చేసిన చిత్ర యూనిట్.. తాజాగా స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సేవ చేస్తూ త్యాగానికి మారుపేరైన భారత సైనికులకు ఘన నివాళిగా ఓ పాటతో కూడిన వీడియోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

Sarileru Neekevvaru Title Song - A Tribute To The Indian Army | Mahesh Babu | DSP | Anil Ravipudi

‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సాగిన ఈ వీడియోలో 1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ చిత్రాలను చూపించారు. ఆయా దృశ్యాలన్నీ రోమాంచితంగా ఉన్నాయి. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది. మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.

శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్‌లు ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.