వీడియో : ‘సరిలేరు నీకెవ్వరూ’ ఫస్ట్ లుక్ టీజర్..మహేష్ ఎంట్రీ

వీడియో : ‘సరిలేరు నీకెవ్వరూ’ ఫస్ట్ లుక్ టీజర్..హీరో ఎంట్రీ

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. శుక్రవారం మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాలోని మహేశ్‌బాబు పాత్రను పరిచయం చేసింది. ఇందులో మహేశ్‌ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. మహేష్ ని ఇంట్రడ్యూస్ చేస్తూండగా వెనక వచ్చే ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది.

Sarileru Neekevvaru THE INTRO | Super Star Mahesh Babu | Anil Ravipudi | DSP

శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్‌లు ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.