భామగా మారిన బామ్మ ( ‘ఓ బేబి’ ట్రైలర్)

రీసెంట్ గా మ‌జిలి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన స‌మంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. . కొరియన్‌ సినిమా మిస్‌ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 5న విడుద‌ల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర ట్రైల‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కెయండి…

Oh Baby Theatrical Trailer | Samantha Akkineni, Naga Shaurya | Nandini Reddy | Suresh Productions

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత స్వాతి అనే క్యారెక్టర్ చేస్తోంది. ఓ ఫొటో స్టూడియో కు వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా ఓ పెద్దావిడా.. పాతికేళ్ల భామ‌గా మారిపోతుంది. అదెలా సాధ్య‌మైంది అనేది అస‌లు క‌థ‌.

విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులోని డైలాగ్స్‌తో పాటు స‌న్నివేశాలు అల‌రిస్తున్నాయి. స‌మంత వృద్ధురాల‌య్యాక ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపిస్తారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. రాజేంద్రప్రసాద్‌ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్‌ కుమారుడిగా, మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు.