సోషల్ మీడియాలో తన కామెంట్స్ తో హల్ చల్ చేస్తూంటుంది సమంత. తన మాటలను ఎవరైనా వక్రీకరించినా, సరిగ్గా అర్దం చేసుకోపోయినా వెంటనే క్లారిటీ ఇస్తుంది. అవసరమైతే కాలర్ పట్టుకున్న రీతిలో క్లాసులు పీకుతుంది. ఇప్పుడు సమంత అదే పనిచేసింది.
రీసెంట్ గా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వూలో చేసిన కామెంట్స్‌పై సమంత సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సందీప్ వంగా తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ లో షాహిద్ కపూర్.. కియారా అడ్వాణీని ముద్దుపెట్టుకునే సన్నివేశాల గురించి సందీప్ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు.
సందీప్ రెడ్డి చేసిన కామెంట్లపై సమంత అసహనం వ్యక్తం చేసింది. ఆ కామెంట్లపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డీప్లీ డిస్టర్బింగ్’ అని ఫోస్ట్ చేసింది.
Liking the film .. and disagreeing with a comment are two different things . I loved the story of one ‘Arjun Reddy’ .. not the generalisation that love means having the liberty of slapping people around . https://t.co/rLWG7L4Gbt
— Samantha (@Samanthaprabhu2) July 7, 2019
సమంత చేసిన ఈ కామెంట్‌ను పట్టుకుని ఓ వెబ్‌సైట్ సమంతవి ‘డబుల్ స్టాండర్డ్స్’ అంటూ ట్వీట్ చేసింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చినప్పుడు మూవీ తనకు నచ్చిందంటూ సమంత చేసిన ట్వీట్ ను, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇమేజ్‌ను కలిపి ట్వీట్ చేసింది.
అయితే, ఈ ట్వీట్‌పై సమంత సదరు వెబ్‌సైట్‌కు కాస్త గట్టిగానే క్లాస్ పీకింది… ‘సినిమాను ఇష్టపడటం, ఒకరి కామెంట్‌తో ఏకీభవించకపోవడం రెండు వేర్వేరు విషయాలు. ‘అర్జున్ రెడ్డి’ కథ నాకు నచ్చింది. కానీ ప్రేమ అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ల చెంపలు పగలగొట్టే స్వేచ్ఛ అని చెప్పడం నాకు నచ్చలేదు’ అని ట్వీట్ చేసింది.