సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్ తో పాటు అక్కినేని ఇంటి కోడలు, అందుకే సమంతా పబ్లిక్ లో ఇప్పుడు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. అయితే సమంత హీరోయిన్ కాకముందు తన కాలేజీ డేస్ మొత్తాన్ని చెన్నై లో గడిపింది. ఆ చెన్నై లోనే సమంతకి ఒక రోజు చేదు అనుభవం ఎదురైంది అంట.
అదేంటంటే సమంతని ఒకరోజు పోలీసులు అడ్డంగా పట్టుకున్నారంట. ఈ విషయం గురించి సమంత మాట్లాడుతూ “నేను 11వ క్లాసులో ఉన్నప్పుడే నాన్నగారు స్కూటీ కొనిచ్చారు. దానిపై పల్లవరం ఇన్ సైడ్ వీధుల్లో ఎంతైనా తిరగొచ్చని కానీ బయట మాత్రం తిరగొద్దు అని నాన్న స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తో పనేం ఉంటుంది? అందుకే స్వేచ్ఛగా తిరిగేసేదాన్ని.
ఓసారి ఎవరికీ చెప్పకుండా లైసెన్స్ లేకుండానే స్కూటీ మీద విమానాశ్రయానికి వెళ్లిపోయాను. పోలీసులు ఆపి లైసెన్స్ అడిగారు. ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసుకుని ఏదోలా అప్పటికి తప్పించుకున్నాను” అని తనకి జరిగిన చేదు అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సమంత. కాగా ఆమె హీరోయిన్ గా నటించిన “యు టర్న్” సినిమా వచ్చే సెప్టెంబర్ 13 న రిలీజ్ అవుతుంది.