అయ్యో పాపం సమంత.. లాక్‌డౌన్‌లో మొత్తం అదే పనా?

లాక్ డౌన్‌లో సమంత ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. మోడ్రన్ రైతుగా అవతారమెత్తి అవసరమైన కారగూయలను పండించుకుంటోంది. ఇక అలా ఎంతో జాగ్రత్తగా, రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన వాటినే వండుకుని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. ఇంటి డాబాపైనే అందమైన వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పురుచుకుంది. ఇక వాటిని జాగ్రత్తగా పెంచడంతో పాటు కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడానికి ఓ ప్రత్యేకమైన టీచర్‌ను కూడా నియమించుకుంది.

Samantha Terrace Garden
Samantha Terrace Garden

లాక్ డౌన్ మొత్తం ఇలా కొత్త కొత్త వాటిని నేర్చుకుంటూ బిజీగా ఉన్న సమంతకు తన పెట్స్ మరో పని పెట్టాయట. అసలే సమంతకు కుక్క పిల్లలంటే మహా ప్రాణం. సమంత ఇంట్లో ప్రత్యేక రకమైన జాతులకు సంబంధించిన కుక్కలున్నాయన్న సంగతి తెలిసిందే. ఆ పెట్ మాత్రం సమంతను రికాం ఉంచడం లేదట. నిత్యం ఏదో ఒక పని చేస్తూ సమంతకు మనశ్శాంతి లేకుండా చేస్తోందట. ఈ మేరకు సమంత చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Samantha Fed Up With Her Pet Actions
Samantha Fed Up With Her Pet Actions

కిచెన్‌లో ఉన్న డోర్‌ను నిమిషానికి ఓ సారి ఓపెన్ చేస్తుందట మళ్లీ అలా క్లోజ్ చేస్తూ ఉంటుందట. లాక్డౌన్‌లో ఇంత బిజీగా ఎలా ఉంటావని అందరూ ఆశ్చర్యపోతుంటారు..అలాంటి వారికి సమాధానం ఇదే.. ఆ డోర్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఇదే పని అంటూ సమంత చెప్పుకొచ్చింది. సమంత ప్రస్తుతం తన రొటీన్ వర్క్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌కు డబ్బింగ్ చెబుతోంది. చాలా రోజుల గ్యాప్ తరువాత ఇలా డబ్బింగ్ చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని సమంత చెప్పుకొచ్చింది.