చైతూను సమంత అలా చంపేస్తుందా ఏంటి?.. వారమంతా అదేనా..!!

Samantha Akkineni About Her Pregnancy

సమంత నాగ చైతన్యల అన్యోన్య దాంపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంతకు వండటమే రాదని, కనీసం వంట గది ఎక్కడుందో కూడా తెలీదని ఆ మధ్య ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన సందర్భాలున్నాయి. తన కంటే చైతూనే బాగా వంట చేస్తాడని కూడా చెప్పింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ సమంతలో ఎన్నో మార్పులు వచ్చాయి. సమంత ఎందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Samantha Akkineni
Samantha Akkineni

తన ఇంటిపైనే అర్భన్ ఫార్మింగ్ చేస్తోంది. ఇంటి డాబాపైనే అదిరిపోయే వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటుచేసింది.దీని కోసం ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో ఓ శిక్షకురాలిని, వంటలు ఎలా వండాలో మరో ట్రైనర్‌ను కూడా పెట్టుకుంది. ఇలా సమంత ఓ ఆదర్శ గృహిణిగా మారింది. ఇందులో భాగంగా తాజాగా సమంత ఓ పోస్ట్ పెట్టింది.

తన వ్యవసాయ క్షేత్రంలో పండిన క్యారెట్‌లను చూపిస్తూ.. ఈ వారానికి సరిపడ మెనూ దొరికిందని తెలిపింది. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ ఫ్రై, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోస అంటూ వారం రోజుల మెనునూ ప్రకటించింది. అయితే ఈ వారం మొత్తం చైతూకు క్యారెట్ బాధ తప్పదేమో. అయినా రోజూ అదే క్యారెట్‌ను ఎలా తింటాడో పాపం అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.