2017లోనే గర్భం దాల్చాను కానీ.. సమంత కామెంట్స్ వైరల్

Samantha Akkineni About Her Pregnancy

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ సమంత, నాగచైతన్యలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. ఇక రామ్ చరణ్-ఉపాసన, సమంత-చైతన్యలకు సోషల్ మీడియాలో కామన్‌గా ఎదురయ్యే ప్రశ్న ఒకటి ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారు? పిల్లల్ని ఎప్పుడు కంటారు? అంటూ నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అయితే వీటిలో సమంతపై మరిన్ని ఎక్కువ వార్తలు పుట్టుకొస్తాయి.

Samantha Akkineni About Her Pregnancy
Samantha Akkineni About Her Pregnancy

సమంత ప్రెగ్నెంట్ అంటూ ఎన్నే యేళ్ల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మీడియా, సోషల్ మీడియాలో వీటిపై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ మధ్య లాక్ డౌన్‌లోనూ అలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. నిత్యం వాటికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా సమంత తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ప్రశ్నలు అడగండి అంటూ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది

Samantha Akkineni About Her Pregnancy
Samantha Akkineni About Her Pregnancy

దీంతో ఓ నెటిజన్ మాత్రం మళ్లీ అదే పర్సనల్ క్వశ్చన్ అడిగాడు. మీరు ప్రెగ్నెంటా? అని అడగడంతో సమంత అదిరిపోయే ఆన్సర్ చెప్పింది. నేను 2107లో గర్భం దాల్చాను కానీ అదేంటో.. ఇంకా బేబీ బయటకు రావడమే లేదు అంటూ కౌంటర్ వేసింది. ఈ సమాధానం చూస్తే సమంత ఫేక్ న్యూస్ రాసేవారిపై బాగానే సెటైర్ వేసినట్టు కనిపిస్తోంది. సమంత ప్రస్తుతం ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది.