సమంత సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మద్య మాత్రం సమంతలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సమంత వస్త్రాధారణలో ఎంతో మార్పు వచ్చింది. అందాలను ఆరబోసేందుకే ఎక్కువగా శ్రద్ద చూపిస్తోంది. సమంత షేర్ చేస్తోన్న ఫోటోలన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిపై శ్రీరెడ్డి చేసే కామెంట్లు కూడా బాగానే హల్చల్ చేస్తున్నాయి.
సమంత ఇప్పుడు ఫ్యామిలీమెన్ 2 సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌లో సమంత ఒకే ఒక్క షాట్‌లో కనిపించింది. టీజర్ ఎండింట్ అలా కనిపించి మెరిసింది. అలా సమంతను ఒక్కసారిగా చూడటంతో అందరూ షాక్ అయ్యారు. ఇక వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు చిత్రయూనిట్ అందరూ కూడా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
అందుకోసమే సమంత ముంబైకి చెక్కేసింది. అయితే సమంత తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో తన స్టైలీష్ట్, డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ గురించి చెప్పుకొచ్చింది. నాలుగేళ్ల బంధం తమది అంటూ చెబుతూఓ ఫోటోను షేర్ చేసింది. అందులో సమంత, ప్రీతమ్ ఒకే సోఫాలో ఉన్నారు. ఇక సమంత తన కాళ్లను ప్రీతమ్ ఒడిలో వేసింది. ఇక సమంత చేసిన ఈ ఫోటోకు ప్రీతమ్ రిప్లై ఇస్తూ ఐ లవ్యూ అని అనేశాడు. మొత్తానికి సమంత చేసిన ఈ పోస్ట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.