సమంతకు జర్నలిస్ట్ పాత్ర బాగా కలసి వస్తున్నదేమో ?

మహానటి సినిమాలో చిన్నదైనా జర్నలిస్ట్ పాత్రకు ప్రాధాన్యత వుంది . బహుశా అందుకే ఒప్పుకుందేమో అనుకున్నారు . నిజానికి మరొకరు హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు చిన్న పాత్ర చెయ్యడానికి ఎవరు ముందుకు రారు . కానీ సమంత తన గ్లామర్ , స్థాయిని పక్కన పెట్టి మహానటి సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేసింది . ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది . దక్షిణ భారతంలో సావిత్రి అంటే తెలియని వారు వుండరు . సావిత్రి జీవితం మీద నాగ్ అశ్విన్ రూపొందించిన మహానటి గత సంవత్సరం విడుదలై ఆ చిత్రంలో నటించిన అందరికీ ఎంతో పేరు తెచ్చి పెట్టింది . ఇక సావిత్రి అక్కినేని నాగేశ్వర రావు ఎన్నో సినిమాల్లో కలసి నటించారు . బహుశా ఈ కారణంవల్ల కూడా అక్కినేని సమంత ఒప్పుకొని ఉండవచ్చు .

ఇప్పుడు సమంత మళ్ళీ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది . కన్నడంలో 2016 లో విడుదలైన “యూటర్న్” చిత్రం ఊహించని విజయం సాధించింది . ఈ సినిమాను పవన్ కుమార్ నిర్మించి దర్శకత్వం వహించాడు . నిజానికి పవన్ కుమార్ పేరున్న దర్శకుడు కాదు . కొత్తవాడు .”యూటర్న్” చిత్రం కమర్షియల్ సక్సస్ సాధించడం తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సంపాదించింది . ఒక చిన్న సమస్య అదీ నిత్య జీవితంలో ఎదురయ్యే ట్రాఫిక్ , ఒక బ్రిడ్జి పై యు టర్న్ లేదు . కొంత మంది యూటర్న్ ఏర్పాటు చేస్తారు . దానివల్ల తారస అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి . అదొక మిస్టరీ అనుకుంటారు . దానిని చేధించడాని ఓ జరలిస్తు ముందుకు వస్తుంది . ఆమెకు ఎదురైనా అనుభవాలే ఈ సినిమా . కన్నడంలో “యూటర్న్” విజయం తరువాత దీని రీమేక్ హక్కుల కోసం చాలా మంది ప్రయత్నం చేశారు . చాలా ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని ఆశ చూపారు . కానీ పవన్ కుమార్ ఎవరికీ ఇవ్వకుండా తెలుగు , తమిళ భాషల్లో కేవలం రెండు కోట్ల యాభయ్ లక్షల్లో తనే తీశాడు .

ఈ చిత్రంలో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నది . ఈ పాత్ర వినగానే ఎంత ఎక్సయిటింగ్ గా అనిపించిందని, ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో సమంత వుంది . సమంత జర్నలిస్ట్ పాత్రపై పెట్టనున్న నమ్మకం అలాంటిది . ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుంది .