బిగ్ బాస్-4 హోస్ట్ గా అక్కినేని కోడ‌లు!

నెల రోజుల త‌రువాత నిద్ర‌లేచింది!

బిగ్ బాస్ షో తెలుగు రాష్ర్టాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ గేమ్ షోపై విమ‌ర్శ‌లు అదే స్థాయిలో ఎప్ప‌టిక‌ప్పుడు వినిపిస్తుంటాయి. మీటూ ఉద్య‌మంలో భాగంగా బిగ్ బాస్ నిర్వాహ‌కులు కాస్టింగ్ కౌ చ్ కు పాల్ప‌డుతున్నార‌ని, క‌మిట్ మెంట్ ఉంటేనే కంటెస్టెంట్ గా తీసుకుంటున్నార‌ని గ‌తంలో ఆరోప‌ణ‌లు తీవ్ర స్థాయిలో వెల్లు వెత్తాయి. స‌రిగ్గా సీజ‌న్ -3 స‌మ‌యంలో ఆరోప‌ణ‌లు మిన్నంటాయి. అప్ప‌టికే హోస్ట్ గా ఎంపికైనా నాగార్జున దీనిపై స్పందించాల‌ని కొంత మంది సోష‌ల్ మీడియాలో నానా యాగీ చేసారు. అయినా వాటిని నాగ్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చివ‌రికి మ్యాట‌ర్ సైలైంట్ అయింది.

తాజాగా బిగ్ బాస్ నిర్వాహ‌కులు సీజ‌న్ -4 కి రంగం సిద్దం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈసారి హోస్ట్ బాధ్య‌త‌లు ఎవ‌రు తీసుకుంటారు? అన్న దానిపై చ‌ర్చ మొద‌లైంది. సీజ‌న్ -1 కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయ‌గా, సీజ‌న్-2 కి నేచుర‌ల్ స్టార్ నాని, సీజ‌న్ -3కి నాగార్జున హోస్ట్ గా చేసారు. ఈ నేప‌థ్యంలో సీజ‌న్ -4 కి ఎలాంటి స్టార్ ని దించుతారు? అన్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీంతో ఈసారి రేసులో అక్కినేని కోడలు, న‌టి స‌మంత పేరు ముందు వ‌రుస‌లో ఉంది. స‌మంత సీజ‌న్ -4 హోస్ట్ అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ఊపందుకుంది. నిర్వాహ‌కులు స‌మంత‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని, ఆమె కూడా సానుకూలంగానే ఉంద‌ని టాక్ వినిపిస్తోంది.

స‌మంత గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే స‌మంత ఇప్ప‌టికే సినిమాలు త‌గ్గించింది. చాలా సెల‌క్టివ్ గా స్ర్కిప్ట్ ల‌ను ఎంపిక చేసుకుంటుంది. ఓటీటీ లాంటి ప్లాట్ పామ్ ల‌పై రాణించాల‌ని ఉవ్విళ్లూరుతుంది. అటు స్కూల్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. కావాల్సినంత స‌మ‌యం కూడా దొరుకుతుంది. ఈ నేప‌థ్యంలో సమంత సీజ‌న్ -4 రేసులో ఖాయ‌మే అనిపిస్తోంది.