చిరంజీవి “సైరా” అంటున్నా … ఇబ్బందులు తప్పడం లేదట

చిరంజీవి “సైరా” అంటున్నా … ఇబ్బందులు తప్పడం లేదట

రామ చరణ్ కొణిదల ప్రొడక్షన్ మీద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “సైరా నరసింహా రెడ్డి చిత్రం .
ఈ సినిమా డిసెంబర్ 6 ,2017న ప్రారంభమయ్యింది . ఇందులో చిరంజీవి ,అమితాబ్ బచ్చన్ ,విజయ సేతుపతి, జగపతి బాబు , నాయన తార, తమన్నా, సుదీప్, అనుష్క మొదలైనవారు నటిస్తున్నారు . సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు .

ఈ సినిమా ప్రారంభం నాటి నుంచి కష్టాలే. మొదట సంగీత దర్శకుడుగా ఏ.ఆర్ రెహమాన్ ను ఎంపిక చేశారు . ఈ కారణం వల్లనో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు . అమిత్ త్రివేదిని నియమించారు . అలాగే కెమెరా మన్ గా రవి వర్మన్ ని ఫైనలైజ్ చేశారు .

ఆయన కూడా చేయలేనని చెప్పాడు . రత్నవేలును ఛాయాగ్రాహకుడుగా తీసుకున్నారు .
ఇది బ్రిటిష్ కాలంనాటి కథ. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రాయల సీమకు పాలెగాడు . కర్నూల్ జిల్లా కోయిలకుంట్ల ప్రాంతానికి చెందినవాడు . బ్రిటిష్ వారిపై పోరాటం చేసి వారి తుపాకీ గుళ్లకు 22 ఫిబ్రవరి 1847లో బలైపోయాడు .

ఈ నరసింహా రెడ్డి కథను చిత్రంగా రూపొందించాలని దర్శకుడు సురేంద్ర రెడ్డి రామ్ చరణ్ కు చెప్పడంతో ఆయనకు నచ్చి చిరంజీవితో సినిమా చెయ్యడానికి అంగీకరించాడు . అలా ఈ సినిమా మొదలైంది .
అనేక కస్టాలు , నష్టాలకు తట్టుకొని సినిమా పూర్తి అయ్యిందని హ్యాపీగా ప్రకటించారు .

అయితే రష్ చూసిన తరువాత కొంత రీ షూట్ అవసరమని భావించారట . ఇటీవలే దీని రీ షూట్ చెయ్యడం ప్రారంభించారని తెలిసింది సినిమా పూర్తి కాకముందే దీని కోసం వేసిన భారీ సెట్ తగలబడి పోయింది … దీని వల్ల షూటింగ్ కు అంతరాయం కలగడం మాత్రమే కాకుండా కోట్ల రూపాయల నష్టం , స్క్రిప్ట్ కూడా పూర్తిగా రెడీ కాకుండా సినిమా ప్రారంభించడం , పరుచూరి బ్రదర్స్ \ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చెయ్యడం , నరసింహా రెడ్డి వారసులు వచ్చి తమకు పరిహారం ఇవ్వాలని ధర్నా చెయ్యడం ఇవ్వన్నీ చిరంజీవికి తలనొప్పిగా మారాయి… నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22 న ప్లాన్ చేశారు .

“సైరా నరసింహా రెడ్డి ” సినిమాను అక్టోబర్ 2, 1019 న విడుదల చెయ్యడాని సన్నాహాలు చేస్తున్నారు . ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన ఈ సినిమా కోసం అందరు ఎదురు చూస్తున్నారు .