ట్రైలర్ లో సాయి పల్లవి కేక పుట్టించింది

తమిళ స్టార్‌ ధనుష్‌ హీరోగా నటించిన సినిమా ‘మారి 2’. సాయి పల్లవి హీరోయిన్. బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో సాయిపల్లవి ఆటో డ్రైవరు పాత్రలో కనిపించి దుమ్ము దులపనుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ధనుష్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించారు.

Maari 2 Trailer (Telugu) - Dhanush | Balaji Mohan | Yuvan Shankar Raja | Dialogues, Lyrics - Samrat

‘చావంటే భయం లేని వాడిని చంపడం చాలా కష్టం’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘ఎనిమిదేళ్లుగా మారి మిస్సింగ్‌ మేడం.. పోలీసులే కాదు.. రౌడీల దగ్గర కూడా ఏ సమాచారం లేదు’ అనిని వరలక్ష్మితో ఓ పోలీసు అధికారి అంటున్నారు. ‘నేను ఎదవలకే ఎదవను రా..’ అని ధనుష్ రౌడీలను హెచ్చరించడం ఆకట్టుకుంటుంది‌. సాయి పల్లవి.. ధనుష్‌ వెంటపడుతూ కనిపించారు.

‘చావుకు దేవుడ్ని నేను.. చావే లేని వాడు మారి.. సరైన శత్రువు’ అని విలన్‌ చెబుతున్నారు. ‘నా గురించి నీకు పూర్తిగా తెలియదు మారి.. నేను చాలా చాలా చెడ్డ వాడ్ని’ అని విలన్‌ అంటే.. ‘నువ్వు చెడ్డవాడివైతే నేను నీ బాబుని’ అని ధనుష్‌ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

తన సొంత నిర్మాణ సంస్ద వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ రైట్స్ ను లైకా సంస్థ తీసుకుని, డిసెంబరు 21 ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.