ఇంకో ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందేనా?
RRR దర్శకుడు జక్కన్న ముందు బిగ్ ఛాలెంజ్ ఉందా? అతడు ఈ ఛాలెంజ్ ని ఎలా నెగ్గబోతున్నాడు? రాజమౌళి- దానయ్య బృందం ఊహించని విధంగా దెబ్బ తిందా? అంటే అవుననే విశ్లేషిస్తున్నారు. ఊహించని వైరస్ మహమ్మారీ దెబ్బకు ప్లాన్ అంతా ఫ్లాపైంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా రాజమౌళి- దానయ్య ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. ఈ పరిణామంతో అంతా మారిపోయిందని ఇన్ సైడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓవైపు షూటింగులకు అనుమతులు లభించినా కానీ మరోవైపు అన్ లాక్ 1.0 వల్ల పెను ప్రమాదం ముంచుకొస్తోంది. వైరస్ మమహ్మారీ అంతకంతకు రెట్టింపవుతోంది. మరికొంతకాలంలో ఎవరూ ఊహించని విధంగా వైరస్ కేసులు పెరిగే వీలుందని భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇంకా టెస్ట్ షూట్ కే పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. రాజమౌళి అండ్ టీమ్ త్వరగా టెస్ట్ షూట్ పూర్తి చేసి లైన్ క్లియర్ చేయాలని చూస్తున్నా అనుమతులు ఇచ్చేందుకు పోలీసులు తటపటాయిస్తున్నారని తెలుస్తోంది. ఇంకా టెస్ట్ షూట్ కే అనుమతులు రాలేదు. అది పూర్తి చేయాలి. అందుకోసం తారక్-చరణ్ డూప్ లను తొలిగా ఉపయోగించనున్నారు. షూట్ అయ్యాక మహమ్మారీ టెన్షన్ పై ఓ క్లారిటీ వస్తుంది. అనంతరం చరణ్.. తారక్ రియల్ గా లైవ్ లోకి దిగుతారట.
ఇదిలా ఉంటే ఆర్.ఆర్.ఆర్ 2021 సంక్రాంతికి వస్తుందా? రాదా అన్న టెన్షన్ దానయ్యను నిలవనీయడం లేదట. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. మునుముందు ఈ నష్టం ఇంకెంత పెరగనుందో అన్న టెన్షన్ వెంటాడుతోందట. ఇంకో ఏడాది పాటు ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రస్తుత సన్నివేశం చూసినవారు సందేహిస్తున్నారు. ఒకవేళ ఇదే వాస్తవరూపం దాలిస్తే 400 కోట్ల బడ్జెట్ ప్రాజెక్ట్ పరిస్థితేమిటన్నదే టెన్షన్.