ఆ ఇద్దరు హీరోయిన్లకు ఒకే రేట్!.. వర్మ మామూలోడు కాదు

RGV Thriller Movie Release on 14th August

RGV Thriller: వర్మకు ఆడవాళ్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్రహ్మ సృష్టిలో తనకు నచ్చింది ఆడవారే అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెబుతాడు. రామ్ గోపాల్ వర్మకు భారత స్త్రీలంటే మక్కువ ఎక్కువని ఆ మధ్య చెప్పుకొచ్చాడు. క్లైమాక్స్ చిత్రంలో మియా మాల్కోవా అందాలను చూడటానికి వంద రూపాలయ టికెట్ పెట్టాడు ఆర్జీవీ. ఆపై నగ్నం సినిమాను చూడటానికి మాత్రం దానికి రెండింతలుగా ఫిక్స్ చేశాడు.

RGV Thriller Movie Release on 14th August
RGV Thriller Movie Release on 14th August

ఆ సందర్భంలో వర్మ ఇచ్చిన వివరణ అందర్నీ ఆకట్టుకుంది. తనకు భారత స్త్రీలంటే ఎక్కువ ఇష్టమని, విదేశీ మహిళలకంటే భారత మహిళలే అందంగా ఉంటారని, అందుకే వారికి రేటు ఎక్కువగా పెట్టానని తెలిపాడు. దానికి తగ్గట్టే నగ్నం బ్యూటీ శ్రీ రాపాక క్రేజ్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఆ చిత్రం కూడా బాగానే వర్కౌట్ అయింది. స్వీటీ (శ్రీ రాపాక) అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే మరోసారి ఓ కొత్త అందంతో వల వేసేందుకు వర్మ రెడీ అయ్యాడు.

ఊల్లాలా ఊల్లాలా, 4 లెటర్స్ వంటి చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రి ఇచ్చిన అంకిత మహారాణ అనే అమ్మాయిని మళ్లీ తన చిత్రంతో కొత్తగా ప్రజెంట్ చేయబోతోన్నాడు వర్మ. అప్సర రాణి అంటూ పేరు కూడా మార్చేసి.. అందాల ఆరబోతతో రెండు తెలుగు రాష్ట్రాల యువత గుండెల్లో గుబులు పుట్టించాడు. ఇక ఈమె నటించిన థ్రిల్లర్ చిత్రం ఆగస్ట్ 14న రాత్రి తొమ్మిది గంటలకు విడుదల కాబోతోంది. ఈ మేరకు నగ్నం బ్యూటీకి ఎంత రేటు పెట్టాడో అప్సరకు కూడా అంతే రేటు పెట్టాడు. థ్రిల్లర్ చిత్రాన్ని వీక్షించాలంటే రెండు వందల రూపాయలను సమర్పించుకోవాలని ప్రకటించాడు.