Revolt of Bheem: తాజాగా విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘కొమరం భీముడో.. కొమరం భీముడో’ పాట పాత పాటకు కాపీ అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది అచ్చం జానపద వాగ్గేయకారుడు గద్దర్ పాడిన ‘మదనా సుందరీ.. మదనా సుందరీ’ పాట లాగే ఉందని ఆ వీడియోను ట్వీట్ చేస్తున్నారు. ‘కొమరం భీముడో’ అని వచ్చేటప్పుడు గద్దర్ పాడిన మదనా సుందరీ పాటే గుర్తుస్తోంది అని అంటుంన్నారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ లోని ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా, కీరవాణి బాణీలు అందించాడు. కీరవాణి కొడుకు కాల భైరవ ఈ పాట పాడాడు.
ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మల్టీ స్టారర్ గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రని రాంచరణ్ పోషిస్తుండగా, కొమరంభీం పాత్రని జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా గా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని దర్శకధీరుడు ‘జక్కన్న’ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ నటి నటులు అలియాభట్, అజయ్ దేవగన్ లు కీలకపాత్రలను పోషించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.