తమిళ హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడంటూ అధికారికంగా అతడి తండ్రి జి కె రెడ్డి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి కుమార్తె ఎవరనే విషయమై చాలా సస్పెన్స్ నెలకొంది. కేవలం పేరు క్లూ మాత్రమే ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన అనిషాతో సంబంధం కుదిరిందని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు ఆమె ఎవరో రివీలైంది.
విశాల్‌ను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. ‘పెళ్లిచూపులు’ చిత్రంలో విజయ్ దేవరకొండకు ప్రేయసిగా నటించిన యువతే. విజయ్ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలోనూ అనీశా నటించారు. విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను అనీశా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. నా ఎదుగుదలలో, ఆలోచనల్లో స్ఫూర్తిగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నాకు సరైన తోడు దొరికింది. విశాల్ మంచి మనసు నాకెంతో నచ్చింది. విశాల్‌తో జీవితం పంచుకుని ఆయన్ను సంతోషంగా ఉంచడానికి నా బెస్ట్ నేను ప్రయత్నిస్తాను.’ అని అనీశా పేర్కొన్నారు. ఈ నెలలోనే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగబోతోందని విశాల్ తండ్రి వెల్లడించారు. పెళ్లి కూడా ఇక్కడే చేయబోతున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో జరగనుంది. తమిళ నటీనటుల సంఘానికి సొంత భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే . ప్రస్తుతం బిల్డింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే ఏడాది పూర్తి కానుంది. బిల్డింగ్ పూర్తైన తర్వాతనే విశాల్ వివాహం చేసుకోనున్నాడని అంటున్నారు. వచ్చే వారంలో ఈ రెండు కుటుంబాలు కలిసి విశాల్, అనీషాల నిశ్చితార్ధం జరపనుండగా, ఆ రోజే పెళ్ళి తేదీ ప్రకటిస్తాడని తెలుస్తుంది. తన పెళ్ళి నడిగర్ సంఘం కొత్త భవనంలో జరగనుందని విశాల్ పేర్కొనడం విశేషం .
దీంతో ఇప్పటి వరకూ వరలక్ష్మీని విశాల్ వివాహం చేసుకోనున్నదనే వార్తలకు తెరపడనుంది.. విశాల్, వరలక్ష్మీలు ఇద్దరూ కూడా తాము మంచి స్నేహితులమని, ప్రేమికులం కాదని మీడియాకు పలుసార్లు వెల్లడించారు.. అయినప్పటికీ వారిపై తరుచు వార్తలు వస్తూనే ఉన్నాయి..