బిగ్ బాస్ 2 సీజన్ మొదలయ్యి 56 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. నాని చెప్పినట్టే ఇంకొంచెం మసాలా యాడ్ అయింది బిగ్ బాస్ లో. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో పాటు, ఎలిమినేటి అయినవారు కూడా హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒకో స్ట్రాటజీ తో గేమ్ ఆడుతుంటారు. వీరందరిలో గణేష్ మాత్రం చాలా అమాయకంగా కనిపిస్తుంటాడు. ప్రతివారం ఎలిమినేషన్ కి నామినేట్ అవుతున్నా ప్రేక్షకులు అతడిని సేవ్ చేస్తున్నారు.
బిగ్ బాస్ 2 మొదలయ్యాక పలు యూట్యూబ్ ఛానెళ్లు కంటెస్టెంట్స్ కుటుంబీకులతో ఇంటర్వ్యూలు చేసే పనిలో పడ్డాయి. అలానే గణేష్ పేరెంట్స్ తో కూడా ఇంటర్వ్యూ చేశాయి. గణేష్ గురించి మాట్లాడుతూ అతని తల్లి కన్నీటి పర్యంతం అయింది. గణేష్ కి ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్టార్ మా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపింది. గణేష్ వలన మాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. బయటకు వెళ్తే గణేష్ తల్లిదండ్రులు అంటూ యెనలేని అభిమానాన్ని చూపిస్తున్నారు జనాలు. ఈ గుర్తింపుకు కారణం బిగ్ బాస్ 2 అని తెలిపారు గణేష్ తల్లి.
గణేష్ చాల మంచివాడని, ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటాడని చెప్పారు. అర్ధరాత్రి అయినా సహాయం కావాలని తెలిసినవాళ్ళు ఫోన్ చేస్తే వెనకా ముందు చూసుకోకుండా వెళ్ళిపోతాడు. తన దగ్గర డబ్బు లేకపోతే పక్కవారి దగ్గర అడిగి తీసుకుని మరీ సహాయం చేస్తాడు. హౌస్ లో కొంచెం డల్ అయ్యాడు. నాని గారి సపోర్ట్ తో ఇప్పుడు నార్మల్ అయ్యాడు. ఇకమీదట తనలో ఉన్న టాలెంట్స్ కూడా బయట పెడతాడు. తన మంచితనం అందరికీ అర్ధం అయ్యింది అందుకే ప్రతివారం ఎలిమినేటి అవుతున్నా ప్రేక్షకులు ఓట్స్ వేసి గెలిపిస్తున్నారు. ఇకమీదట కూడా అదే సప్పోర్ట్ ఇవ్వాలి అని కోరారు గణేష్ తల్లి. ఇలా గణేష్ గురించి మాట్లాడుతూ ఆవిడ ఏడ్చేశారు.