“RC 15” రూమర్స్ పై స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ.!

పాన్ ఇండియా సినిమా దగ్గర అప్ కమింగ్ బిగ్ స్టార్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన సత్తా చాటేందుకు ఒకదాన్ని మించి ఒక భారీ సినిమా చేస్తున్నాడు. మరి ఈ చిత్రాల్లో ఇండియన్ సినిమా దగ్గర రాజమౌళి తో పాటు మరో టాప్ దర్శకుడు శంకర్ తో ఇప్పుడు సినిమా చేస్తుండగా ఈ సినిమాపై స్కై హై అంచనాలు ఉన్నాయి. 

ఇక శంకర్ సినిమాలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయో కూడా ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు. పైగా సోషల్ సబ్జెక్టు అంటే ఇక ఇండియన్ సినిమా దగ్గర శంకర్ ని కొట్టే దర్శకుడు కూడా మరొకరు లేరు. దీనితో చాలా కాలం తర్వాత తన నుంచి వస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో దీనిపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. 

దీనితో చాలా కేర్ గా సినిమా కంప్లీట్ చేస్తుండగా ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఓ  వచ్చింది. ప్రస్తుతం తమ సినిమా పేరు వాడి కొంతమంది వ్యక్తులకి ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో మెసేజ్ లు వెళ్తున్నాయని కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని ఒకవేళ అలా ఎవరికైనా మెసేజ్ లు వస్తే నమ్మవద్దని. 

మేము ఏమి అలా ఏ ఆడిషన్స్ చెయ్యలేదని స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే వారికి అందించారు. దీనితో అంతా అప్రమత్తం కావాల్సి ఉందని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.