సైలెంట్ గా రవితేజ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ చేసేసారుగా.!

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరోస్ లో మాస్ మహారాజ్ రవితేజ పేరు తప్పకుండా ఉండి తీరుతుంది. ఇక ఇదిలా ఉండగా రవితేజ మళ్ళీ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా అనేక ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉండడమే కాకుండా వాటిని అత్యంత వేగంగా కూడా కంప్లీట్ చేస్తుండడం గమనార్హం.

ఆల్రెడీ షూట్ ప్రోగ్రెస్ లో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఉండగా దర్శకుడు త్రినాథ రావు నక్కినతో “ధమాకా” అనే ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని రీసెంట్ గా దసరా కానుకగా అనౌన్స్ చేశారు. అయితే ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమా ఆల్రెడీ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిపోయింది.

అలాగే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు హీరోయిన్ ఎవరు అన్నది రివీల్ చెయ్యలేదు కానీ సైలెంట్ గా ఆమెతో ఆల్రెడీ ఈ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసారు. ఇంతకు ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సినిమా “పెళ్లి సందD” లో కనిపించిన యంగ్ బ్యూటీ శ్రీ లీల ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కూడా రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా ఇది అంతకు మించిన ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.