కేవలం 20 నిమిషాల కోసం రష్మిక అంత తీసుకుంటుందా.. వామ్మో టూ మచ్ !

Rashmika mandanna demands 1 crore for acharya movie

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచియమైనా.. గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హోదాను తెచ్చుకున్నది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఆ తర్వాత వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. కొన్ని ఆడాయి.. కొన్ని ఆడలేదు.. అయినా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది రష్మిక.

Rashmika mandanna demands 1 crore for acharya movie
Rashmika mandanna demands 1 crore for acharya movie

ఈ సంవత్సరం వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా తనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ కరోనా వల్ల ప్రస్తుతం ఆగిపోయింది.

ఇంకా రష్మికకు ఆఫర్లు చాలానే వస్తున్నాయట. ఎన్టీఆర్ సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తనకు ఇప్పుడు డిమాండ్ బాగానే ఉన్నది మరి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్యలో ఓ ముఖ్యమైన రోల్ కోసం రష్మికను చిత్రబృందం కలిసిందట.

ఆచార్యలో రష్మిక రోల్ చిన్నదే. 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రామ్ చరణ్ సరసన నటించాల్సి ఉంటుంది. అయితే.. ఆ రోల్ కు 40 నుంచి 50 లక్షల వరకు తనకు ఇవ్వడానికి మూవీ యూనిట్ రెడీ అయిందట.

కానీ.. రష్మిక మాత్రం ఆ రోల్ చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దీంతో దర్శకనిర్మాతలు అవాక్కయ్యారట. వామ్మో.. 20 నిమిషాల రోల్ కు కూడా అంత డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా.. తనకు ప్రస్తుతం తెలుగులో అంత క్రేజ్ ఉంది మరి. అందుకే అంతలా డిమాండ్ చేస్తోంది.

తను సినిమాలో ఉండాలంటే.. తను అడిగినంత పారితోషకం ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదు.. ఏం చేస్తాం.. కలికాలం.. అంటూ దర్శకనిర్మాతలు లోలోపల అనుకుంటున్నట్టు సమాచారం. మరి.. ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన రష్మిక నటిస్తుందా? లేదా? అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.