రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తెరపై ఎంత అల్లరి పిల్లగా కనిపిస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్టు వ్యవహరిస్తుంది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో వరుస హిట్లు కొట్టేసింది. ఏకంగా ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. ఇక్కడి క్రేజ్‌తో కోలీవుడ్‌లో ఆఫర్లు కొట్టేసింది. అలా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లొనూ దుమ్ములేపుతోంది. అలా మొత్తానికి రష్మిక ప్యాన్ ఇండియన్ హీరోయిన్‌గా ఎదుగుతోంది.
అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అయితే రష్మిక మాత్రం ఎప్పుడూ కూడా అందాలను ఆరబోసేలా దుస్తులు ధరించలేదు. నిండైన వస్త్రాధారణతోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ మధ్య బీచ్‌లో వర్కవుట్లు చేస్తూ బుల్లి నిక్కర్లో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. రష్మిక షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అలా తాజాగా రష్మిక చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా ఏ మూడ్‌లో ఉంటే కళ్లజోడు ధరిస్తారంటూ జనాలను రష్మిక ప్రశ్నించింది. కళ్లజోడు పెట్టుకున్న ఫోటోను షేర్ చేసిన రష్మిక ఈ మేరకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చింది. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు.. ఏదైనా మంచి జరగనప్పుడు బాధలో ఉన్నప్పుడు లేదా.. ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు లేదా.. బాగా ఏడుస్తున్నప్పుడు.. ఇలా ఏ సందర్భంలో ఉన్నప్పుడు కళ్లజోడు ధరిస్తారంటూ చెప్పుకొచ్చింది. కానీ రష్మిక ఇప్పుడు ఏ మూడ్‌లో ఉండి వాటిని ధరించిందో మాత్రం చెప్పలేదు.