హాట్ రష్మిక కూల్ గా మాట్లాడుతుందే ?

హాట్ రష్మిక కూల్ గా మాట్లాడుతుందే ?

ఇటీవల కాలంలో సూపర్ హిట్ జంట ఎవరు అంటే విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న . గీత గోవిందం , ఎప్పుడు డియర్ కామ్రేడ్ చిత్రాల్లో వీరిద్దరి మధ్య శృంగార సన్నివేశాలు మోతాదు మించిపోయాయి అంటున్నారు .. మీడియాలో ఈ జంట గురించి పొగడ్తలు , సోషల్ మీడియాలో ..,. ఇద్దరి మధ్య ఎదో .. కెమిస్ట్రీ వుంది … అందుకే అలా నటించగలుగుతున్నారు … అంటూ బంధం కలుపుతున్నారు .

“గీత గోవిందం ” పెద్ద హిట్ అయ్యింది .. ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు వీరు మళ్ళీ జంటగా నటిస్తున్న “డియర్ కామ్రేడ్” చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ కావచ్చు అని అంచనా వేస్తున్నారు . ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు . రష్మిక క్రికెటర్ గా నటిస్తుంది . వీరిద్దరి మధ్య హాట్ లిప్ లాక్ సన్నివేశాల గురించి ఇప్పటికే మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది .

బహుశా దీనిని దృష్టిలో పెట్టుకొనే రష్మిక మాట్లాడుతూ … మా ఇద్దరి మధ్య రొమాన్స్ మాత్రమే చూడకండి … దానిని మించి మంచి సందేశం వుంది అని చెప్పింది . అంటే డియర్ కామ్రేడ్ సినిమా లో కేవలం ముద్దులు , కౌగిలింతలు మాత్రమే కాదు అని చెప్పే ప్రయత్నం చేసింది . అయినా ఈ తరం ప్రేక్షకులకు కావలసింది హాట్ హాట్ లిప్ లాక్ లే .. అయినా ఎదో సందేశం అంటూ రష్మిక ఎందుకు కవర్ చేస్తుందో ?