రష్మికకు బాలీవుడ్ ఆఫర్

Rashmika Mandanna

మన దేశంలోనే బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీలలో బాలీవుడ్ సినీ వర్గం కూడా ఒకటి. అయితే బాలీవుడ్ హీరోలకు కానీ హీరోయిన్ లకు కానీ ఏ రేంజ్ లో డిమాండ్ ఉంటుందో తెలిసిందే. ఇటు గ్లామర్‌ పాత్రలకు,  అటు ట్రెడిషనల్‌ క్యారెక్టర్ లకు  సూట్‌ అయ్యే హీరోయిన్ లకు  బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంటుందని దర్శకనిర్మాతలు భావిస్తుంటారు.

Rashmika Mandana bags bollywood offer
Rashmika Mandana

అయితే.. ఇప్పుడు  బాలీవుడ్ కథానాయికల చూపు కూడా టాలీవుడ్ వైపునకు మరలుతున్న విషయం తెలిసిందే! చాలా మంది తారలు తెలుగులో పేరు తెచ్చుకున్నాక, హిందీ సినిమాల్లో రాణించాలనుకోవడం మామూలే. అదే కోవలోకి మరో కథానాయిక చేరబోతోందిట. ఆమె ఎవరోకాదు..  మన టాలీవుడ్ లోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి క్రేజ్ అండ్ స్టార్ డమ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ రష్మికా మందన్నా.

టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు భారీ చిత్రాలతో మరింత బిజీగా ఉంది. అయితే యూత్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కు  ఓ బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. రష్మిక సన్నిహితులు సైతం దీనిని ధృవీకరిస్తున్నారు.

ఇంత  బాలీవుడ్ ఆఫర్ అంటే మాటలు కాదు! అందుకు ఓ కారణం ఉంది.  రష్మికకు జాతీయ స్థాయిలోనే ఓ అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సెర్చు ఇంజిన్ అయినటువంటి గూగుల్ చెప్తున్నా మాట ఇది. రష్మిక నుంచి జాతీయ స్థాయి క్రష్ గా ఎంపిక చెయ్యడం ఇప్పుడు మంచి హాట్ టాపిక్ అయ్యింది. అందుకే  రష్మిక కు బాలీవుడ్  ఆఫర్ వచ్చిందని చెబుతున్నారు.