స్టార్ హీరోయిన్ త్రిష, హీరో రానాల మధ్య ఏదో ఉందనే ప్రచారం చాలా కాలంగా మీడియాలో నానుతోంది. ఇద్దరి పర్శనల్ ఫొటోలు కూడా లీక్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో.. ‘త్రిషతో డేటింగా.. రానా ఒప్పుకోడు’ అని అఖిల్ చేసిన కామెంట్స్ కూడా వీరి ఎఫైర్ కు బలం చేకూర్చాయి.
అయితే అటు రానా గానీ, ఇటు త్రిష గానీ దీనిపై ఎప్పుడూ నోరు విప్పలేదు. ఖండించలేదు..అలాగని అవును మేము రిలేషన్ లో ఉన్నామని అనలేదు. అయితే ఈ మధ్యకాలంలో ఆ వార్తలు పెద్దగా వినపడటం లేదు. కానీ మరోసారి వీరిద్దరూ వార్తల్లోకి వచ్చారు. త్రిషను ప్రశంసిస్తూ రానా దగ్గుబాటి ట్వీట్ చేశాడు.
తాజాగా త్రిష తాను ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు అయిపోయిందని.. తనను ఇంతగా అభిమానించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపింది. ‘మీరు పెడుతున్న చాలా మంచి పోస్టులకు, మెసేజ్‌లకు, వీడియోలకు చాలా థాంక్స్. ది స్వీటెస్ట్ 16 ఇయర్స్. నా ఈ ప్రయాణంలో నాతో ఉన్న మీకంటే నాకు ఇంకా ఎక్కువ ఏం కావాలి?’ అని ట్వీట్ చేసింది.
దీనిని చూసిన రానా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అయిపోయిందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. ‘వావ్ మూవీస్‌లోకి వచ్చి 16 ఏళ్లు అవుతోందా! వెల్ డన్. నీవు మరింత కాలం ఇలాగే కొనసాగాలి’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.