వైరల్ : తన సినిమా ఇష్యూపై దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన రానా.!

Rana Gave Solid Answer Who Posting His Movie Ott Release | Telugu Rajyam

టాలీవుడ్ హల్క్ హీరో రానా దగ్గుబాటి ఇప్పుడు పలు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పాత్రకి తగ్గట్టుగా రానా చాలా అద్భుతమైన పెర్ఫామెన్స్ లు కూడా అందించాడు. అయితే రానా హీరోగా నటించినటువంటి చిత్రాల్లో రిలీజ్ కి ఎప్పుడు నుంచో రెడీగా ఉన్న సినిమా “విరాట పర్వం”.

దర్శకుడు వేణు ఉడుగులా తెరకెక్కించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ మాత్రం దగ్గుబాటి అభిమానులకు ఇంకా అందని ద్రాక్ష లానే ఉండగా పలు ఓటిటి ఆఫర్స్ అంటూ టాక్ కూడా వచ్చింది.

మరి అలా సోషల్ మీడియాలో ఓ పేజీ వాళ్ళు ఈ సినిమాకి ఏవో భాష ప్రాబ్లెమ్స్ ఉండడం వల్ల థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటిటి రిలీజ్ చేస్తున్నారని పోస్ట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ రానా “ఆ ఇష్యూ లు ఏవో నాకు కూడా చెప్పండి. ఏమి టైం పాస్ గాళ్ళు బ్రో మీరు” అంటూ వాళ్లకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు దీనితో ఇది కాస్తా వైరల్ అవుతుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles