యంగ్ హీరో రానా పెళ్లెప్పుడు? ప‌్రతిసారీ మీడియా అడిగే ఈ ప్రశ్నకు సమాధానం దాటవేస్తూనే ఉన్నాడు. కానీ ఇక తప్పించుకునే వీల్లేదని భావించాడో ఏమో.. తనకు తానుగానే సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇదిగో ఈ అమ్మాయినే నేను పెళ్లాడుతున్నా.. అంటూ క్లారిటీ ఇచ్చేశాడు సోషల్ మీడియా ద్వారా. ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ మిహికా బజాజ్ ని రానా వివాహం చేసుకోనున్నాడు. ముంబైలో పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ .. వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ లు రన్ చేస్తున్నారట.
రానా తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోని సోషల్ మీడియాల్లో షేర్ చేయగానే పరిశ్రమ ప్రముఖులంతా ఆసక్తికర వ్యాఖ్యలతో పెళ్లి మూడ్ ని పెంచేశారు, `శతమానం భవతి` అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందించడంతో రానా పెళ్లిపై అందరికీ పూర్తి క్లారిటీ వచ్చేసింది. త్వరలో పెళ్లికి రెడీ అవుతున్న నితిన్, నిఖిల్ సైతం రానాను తమ ముఠాలో కలిపేసుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. రానా భార్య ఎవరో తెలిసిపోయింది అంటూ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. మంచు లక్ష్మీ ప్రసన్న .. ఇక ఒత్తిడి తగ్గిపోతుందిలే! అంటూ కాస్త కొంటెగా ట్వీట్ చేశారు. డెడ్ డైడ్.. అంటూ సమంత ఎగ్జయిట్ మెంట్ ని కనబరచడం ఇంట్రెస్టింగ్.
ఉన్నట్టుండి సడెన్ గా సర్ ప్రైజ్ చేశాడు రానా. ఇది ఎవరూ నమ్మలేనిది. దగ్గుబాటి సురేష్ బాబు నుంచి రానాపై చాలా కాలంగా ఒత్తిడి ఉన్నా కానీ ప్రతిసారీ పెళ్లి మాట ఎత్తితే ఆన్సర్ ఇవ్వకుండా దాటవేసేవాడు. ఇక అందాల కథానాయికలతో రానా ఎఫైర్స్ గురించి తెలిసిందే. ఆ క్రమంలోనే తన లవ్ మ్యాటర్ ని అలాగే.. పెళ్లి మ్యాటర్ ని గోప్యంగా ఉంచాడని భావించాల్సి ఉంటుందేమో!
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020