ముత్తయ్య మురళీధరన్ బయో పిక్ కు సహా నిర్మాతగా రానా దగ్గుబాటి

హీరో రానా చిన్ననాటి నుండే సినీ వాతావరణంలో పెరగడంతో చిన్నప్పటి నుండే సినిమాకు సంబంధించిన అన్ని అంశాలను దగ్గరనుంచీ చూసి ఇప్పుడు వాటి పై మంచి పట్టు ఉందని అతని సన్నిహితులు చెప్పే మాట. అందుకే అయన కేవలం సినిమాలో నటనకే పరిమితం కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా ఇది వరకే చేప్పట్టారు.

ఇప్పుడు మళ్ళీ మరో సారి సహా నిర్మాతగా మారుతున్నారు. అది కూడా బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయో పిక్ ను తమ స్వంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ మరియు దార్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియచేసారు.

ఈ సినిమాలో బౌలర్ మురళి పాత్రకు తమిళ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. ఈ మేరకు విజయ్ మాట్లాడుతూ – ‘బౌలర్ మురళి పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందనీ పైనా ఈ ప్రాజెక్ట్ కోసం స్వయంగా మురళీధరన్ తో పని చేయడం మరో అదృష్టమని పేర్కొన్నారు.
ఈ సినిమాను దక్షిణాదిన పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి MS శ్రీపతి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలవుతుంది.