‘ఇస్మార్ట్‌ శంకర్‌’ స్టోరీ, టాక్: హిట్టా, ఫట్టా?

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ స్టోరీ, టాక్: హిట్టా, ఫట్టా?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్‌. పూరి, చార్మిలు నిర్మించిన ఈ సినిమాలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ రోజు ( జూలై 18న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఓవర్ సీస్ లో షోలు పడ్డాయి. అక్కడ నుంచి అందుతున్న రిపోర్ట్ ఏమిటి..అసలు ఈ సినిమా కథేంటో చూద్దాం.

ఇస్మార్ట్ శంకర్ (రామ్)ఓ లోకల్ రౌడీ. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూంటాడు. అతనికో కిల్లింగ్ కాంటాక్ట్ వస్తుంది. అతని జీవితం సెటిల్ అయ్యిపోతుందని భావించి ఓకే చేస్తాడు. అదే అతన్ని సమస్యల్లో తోస్తుంది. మరో ప్రక్క అదే సమయంలో అరుణ్ (సత్యదేవ్) సిబీఐ ఇన్విస్టిగేషన్ చేస్తూంటాడు. ఓ లవ్ స్టోరీ కూడా రన్ అవుతూంటుంది. ఈ రెండు ప్లాట్ లు ఓ చోట కలుస్తాయి. పోలీస్ లకు పట్టుబడ్డ శంకర్ బుర్రలోకి ఓ మెమెరీ చిప్ ని అమరుస్తాడు సిబీఐ అథికారి . ఆ మెమరీ చిప్ ద్వారా శంక‌ర్ బుర్ర‌లోకి వేరొక వ్య‌క్తి జ్ఞాప‌కాల్ని పంప‌డం జరుగుతుంది. అయితే దాని ఫలితం ఏమిటి? అస‌లు అత‌డి మెద‌డులోకి చిప్ ని వేరొక వ్యక్తి జ్ఞాప‌కాల్ని ఎందుకు పంపించాల్సిన అవసరం వచ్చింది? ఈ క‌థ‌లో విల‌న్స్ ఎవరు? సీబీఐ టార్గెట్ ఏంటి? వంటి విషయాలతో ఇంట్రస్టింగ్ గా కథ నడుస్తుంది.

సినిమా ఫస్టాఫ్ బాగానే ఫన్ తో నడిచిపోయినా, అసలు కథలోకి వచ్చేసరికి కాస్త స్లో అయ్యిందని వినపడుతోంది. మరీ ముఖ్యంగా కథ అనేది పెట్టుకోకుండా కేవలం కథనంతో సినిమాని లాగేసాడు పూరి జగన్నాథ్. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాని పరుగెట్టించే ప్రయత్నం చేసాడు. అయితే చాలా చోట్ల ప్రెడిక్టుబుల్ గా కథ నడవటం ఇబ్బంది పెట్టినా, అది బి,సి సెంటర్లకు పనికొచ్చే మాస్ మసాలా సీన్స్ తో మాయ చేసేసాడు. ఫ్యామిలీలకు ఎక్కడం కష్టమోమో కానీ సినిమా మిగతావాళ్లకు నచ్చుతుంది. ముఖ్యంగా తెలంగాణా యాసతో పూర్తి యాక్షన్ తో రామ్ తెరపై రెచ్చిపోయారు. నైజాంలో మంచి అప్లాజ్ వస్తోంది. పూర్తి రివ్యూతో మరి కాస్సేపట్లో కలుద్దాం.