నిఖిల్.. గికిల్ వీళ్లంతా ప‌వ‌న్ కళ్యాణ్ తొత్తులు అన్న వ‌ర్మ‌!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `ప‌వ‌ర్ స్టార్` సినిమా ఎన్ని వివాదాల‌కు..ఎలాంటి వివాదాల‌కు దారి తీస్తుందో తెలిసిందే. కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ( ఎన్నిక‌ల త‌ర్వాత‌) జీవితానికి సంబంధించిన క‌థ కావ‌డంతో ఇంత కాక‌రేగుతోంది. ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియాలో వ‌ర్మ ని దూషించ‌డం…వ‌ర్మ ఇంట‌ర్వ్యూలో వార్నింగ్ లు ఇవ్వ‌డం…వ‌ర్మ ఆఫ‌స్ పైకి దుండ‌గ‌లు దాడికి దిగ‌డం ఇలా ప్ర‌తీది హాట్ టాపిక్. ఈ అంశాల‌న్నింటిని వ‌ర్మ ప‌వ‌ర్ స్టార్ సినిమాకు కావాల్సింత‌న ప్ర‌చారం గా మార్చుకున్నాడు. ప‌వ‌న్ అభిమానుల ఆవేశాన్నే వ‌ర్మ ప్ర‌చార ఖ‌ర్చుగా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాల్ని వ‌ర్మ చెబితేనే తెలిసింది.

ఇక వ‌ర్మ తీరును ఉద్దేశించి న‌టుడు నిఖిల్ `కుక్క మొరిగితే శిఖరం త‌ల తిప్పి చూడ‌దని` కామెంట్ చేసిన విష‌యం కూడా తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిఖిల్ ట్వీట్ మ‌రో ఇంటర్వ్యూలో వ‌ర్మ ముందుకు వెళ్లింది. దీనికి వ‌ర్మ అంతే ధీటుగా బ‌ధులిచ్చాడు. నిఖిల్ గికిల్ అత‌నెవ‌రో తెలియ‌దు. వీళ్లంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాలోవ‌ర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ప‌వ‌న్ పేరు చెప్పుకుని అత‌ని ఫాలోయింగ్ తో వాళ్లు ఎదుగుదామ‌ని చూసే వాళ్లు ఇండ‌స్ర్టీలో కొంత మంది ఉన్నారు. అందులో మీరు చెప్పిన ఆ గికిల్ ఒక‌డై ఉండొచ్చు. అయినా ఇలాంటి వాళ్ల‌ని..ఇలాంటి కామెంట్ల‌ను ప‌ట్టించుకోను అని వ‌ర్మ అన్నారు. దీంతో ఈ కామెంట్లు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ప‌వ‌ర్ స్టార్ సినిమా వ‌ర్మ వ‌ర‌ల్డ్ ఓటీటీ థియేట‌ర్లో రిలీజ్ కాక‌ముందే ఇంత కాక రేగుతుందంటే? రిలీజ్ త‌ర్వాత ఇంకెంత కాక రేగుతుందో? అన్న అనుమానాలు భారీగానే వ్య‌క్తం అవుతున్నాయి. పోస్ట‌ర్లు, ట్రైల‌ర్, పాట‌తో హీటెక్కించిన వ‌ర్మ సినిమాతో హీటెక్కించ‌లేడా? అన్న సంకేతాలు బ‌లంగా అందుతున్నాయి. రిలీజ్ త‌ర్వాత అభిమానులు మ‌ళ్లీ వ‌ర్మ మీద‌కు వెళ్లినా వెళ్లొచ్చు! అని ఆ విధంగా వ‌ర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సిద్దం చేసి పెట్టుకునే ఉంటాడ‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.