షాకింగ్ వీడియో:‘ఇస్మార్ట్ శంకర్’కు బీరుతో అభిషేకం

షాకింగ్ వీడియో:‘ఇస్మార్ట్ శంకర్’కు బీరుతో అభిషేకం

హీరోల హోర్డింగ్ లకు పాలాభిషేకాలు చాలా కామన్. కానీ ఓ క్రియేటివ్ జీనియస్ కాస్తంత ఎక్కువ ఆలోచించి..ఎప్పుడూ పాలేనా ..కాస్తంత కొత్తగా బీర్ తో అభిషేకం చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అతని ఆలోచన ఇప్పుడు అందరికీ నచ్చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ‘ఇస్మార్ట్ శంకర్’ హీరో రామ్ చిత్రపటానికి ఓ అభిమాని బీర్‌తో అభిషేకం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. విశాఖలోని జగదాంబ థియేటర్‌లో ఓ అభిమాని ఇలా వెరైటీగా అభిషేకం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీన్ని చూసిన పూరి జగన్నాథ్ ‘మార్ ముంత’ అనే క్యాప్షన్ తో ఇది ఇస్మార్ట్ ఆలోచన అంటూ వీడియోను షేర్ చేశారు. ఇదిలా ఉంటే హీరో రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిన్న విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles