ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసి..చిరంజీవి షాక్,సలహా

ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న క్రేజీ సినిమాల్లో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ఒకటి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా… ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు చరణ్ ముందు చిత్రం ‘రంగస్థలం’ భారీ హిట్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో సైతం చిత్రంపై క్రేజ్ నెలకొంది. దీంతో థియేట్రికల్ బిజినెస్ 90 కోట్ల పైగానే జరిగిందని సమాచారం. అంటే సినిమా మినిమం 100 కోట్ల షేర్ రాబడితేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు.

ఇక ఈ ప్రి రిలీజ్ లెక్కలు చూసి ఎంతో అనుభవం ఉన్న చిరంజీవే ఒక్క క్షణం ఆశ్చర్యపోయారట. ట్రేడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాకపోతే ఈ రేంజి బిజినెస్ లో రిస్క్ ఉంటుందని,జాగ్రత్తగా ప్రమోట్ చేసి జనాల్లోకి బాగా తీసుకెళ్లి, ఓపినింగ్స్ రప్పించగలిగాలని, సంక్రాంతి వీక్ మొత్తం హౌస్ ఫుల్ అయితే అందరూ సేఫ్ అవుతారని ఆయన చెప్పారట.  భాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలంటే జనవరి 11 వరకు ఆగాల్సిందే. ఈ లోగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియావైజ్ చూద్దాం.

నైజాం : Rs 20 కోట్లు

సీడెడ్ : Rs 15 కోట్లు

ఉత్తరాంధ్ర : Rs 11.70 కోట్లు

కృష్ణా : Rs 6.40 కోట్లు

గుంటూరు : Rs 7.80 కోట్లు

ఈస్ట్ గోదావరి జిల్లా : Rs 7.20 కోట్లు

పశ్చిమ గోదావరి జిల్లా : Rs 5.60 కోట్లు

నెల్లూరు : Rs 3.30 కోట్లు

మొత్తం ఆంధ్రా/తమిళనాడు : Rs 77 కోట్లు

భారత్ లో మిగతా ప్రాంతాలు : Rs 8.50 కోట్లు

ఓవర్ సీస్ : Rs 9 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ : Rs 94.50 కోట్లు

డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతమందించారు. భరత్‌ అనే నేను ఫేమ్‌ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. స్నేహ, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.