బాల‌య్య‌ను వెయిట్ చేయిస్తున్న హీరోయిన్‌!

(ధ్యాన్)

నంద‌మూరి బాల‌కృష్ణ ఓకే అనాలేగానీ హీరోయిన్లు అంద‌రూ వెంట‌నే ఆయ‌న ముందుకొచ్చి వాలుతారు. సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ అని పేరు తెచ్చుకున్న న‌య‌న్‌తార కూడా రెడీగా ఉంటుంది. ఉత్త‌రాది నుంచి విద్యాబాల‌న్ కూడా దిగి వ‌చ్చింది. ఇంత క్రేజ్ ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ ని కూడా ద‌క్షిణాదిన ఓ భామ వెయిట్ చేయిస్తోంది. ఆమె ఎవ‌రో కాదు… రకుల్ ప్రీత్‌సింగ్‌. ర‌కుల్ ప్ర‌స్తుతం చేతి నిండా త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. దాంతో ఆమె కాల్షీట్లు ఖాళీగా లేవ‌ట‌. అందువ‌ల్ల య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌లో ఎప్పుడు పాల్గొంటుందో క‌రెక్ట్ గా చిత్ర నిర్మాత‌లు కూడా చెప్ప‌లేక‌పోతున్నారు. ఆమె డేట్లు ఫిక్స్ కాగానే తానే స్వ‌యంగా ప్ర‌క‌టించనున్న‌ట్టు చిత్ర స‌హ నిర్మాత విష్ణు తెలిపారు. ఇంత‌కీ `య‌న్‌.టి.ఆర్‌` చిత్రంలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఏ పాత్ర‌లో న‌టించ‌నుంద‌నేగా మీ అనుమానం… ఆమె న‌టించ‌నున్న‌ది శ్రీదేవి పాత్ర‌లో. శ్రీదేవి తెలుగులో న‌టించిన సినిమాల్లో య‌న్‌.టి.ఆర్ స‌ర‌స‌న న‌టించిన సినిమాలు ఎంత ప్ర‌జాద‌ర‌ణ పొందాయో తెలిసిందే.