రజినీకాంత్ కి ఈ రీసెంట్ హిట్ సినిమా అంత బాగా నచ్చేసిందా..??

ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గరకి వచ్చిన చిత్రాల్లో ఎన్ని సినిమాలు భారీ హిట్స్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షం కురిపించాయో అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హిట్స్ కూడా ఉన్నాయి.

మరి వాటిలో అయితే ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో మరో స్టార్ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ ఆలాగే స్టార్ హీరో సూర్య ఒక పవర్ ఫుల్ కామియో లో నటించిన చిత్రం “విక్రమ్” కూడా ఒకటి.

ఈ సినిమాతో హిందీ కలెక్షన్ లేకుండా కమల్ హాసన్ 430 కోట్లకి పైగా వసూళ్ళని కొల్లగొట్టారు. మరి ఇంత పెద్ద హిట్టయ్యిన సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ ఆల్రెడీ రిలీజ్ టైం లోనే చూడగా మళ్ళీ రెండో సారి విక్రమ్ సినిమాని చూసి మళ్ళీ చిత్ర దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ని మెచ్చుకున్నారట.

ఇలా రజినీ అయితే రెండు సార్లు ఒక సినిమా చూసి అభినందించడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. దీనితో ఇది మాత్రం నిజంగా ఒక పెద్ద వండర్ అనే చెప్పాలి. అలాగే తనకి ఈ సినిమా కూడా ఎంతలా నచ్చేసిందో కూడా అర్ధం చేసుకోవచ్చు..