A – ఆదిపురూష్ మీద రాజమౌళి రియాక్షన్ ఇదే.. ప్రభాస్ కి ఫోన్ చేసి ఏమన్నాడంటే..!

rajamouli reaction on prabhas adipurush

ఆదిపురుష్.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇది. మామూలు గీమూలు సినిమాలు అనౌన్స్ చేస్తే.. దాని మీద ఇంత పెద్ద టాపిక్ నడిచేదే కాదు. కానీ.. ఓవైపు బాహుబలి స్టార్… పాన్ ఇండియా రేంజ్ ఉన్న నటుడు, మరోవైపు బాలీవుడ్ లో తొలిసారి డైరెక్ట్ గా నటిస్తున్న సినిమా, అది కూడా రామాయణం లాంటి ఇతిహాసాన్ని బేస్ చేసుకొని వస్తున్న సినిమా కావడంతో ఒక్కసారిగా ఈ సినిమా గురించి హైప్ క్రియేట్ అయింది.

rajamouli reaction on prabhas adipurush
rajamouli reaction on prabhas adipurush

నిజానికి ఇలాంటి సినిమాను ఒప్పుకోవడం, దాన్ని తెరకెక్కించడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో ప్రభాస్ ను, ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయే ఓం రావత్ ను మెచ్చుకోవాల్సిందే. ప్రభాస్ మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ప్రభాస్ ది ఏ సినిమా వచ్చినా.. అది బాహుబలిని మించిపోయి ఉండాలి.. లేకపోతే ఆ సినిమా తేలిపోవాల్సిందే.

అందుకే.. ఎన్నో హంగులతో సాహోను తీసుకొచ్చినా.. ఆ సినిమాను ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ప్రభాస్ పై ఉన్న అంచనాలు అంత భారీగా ఉన్నాయి మరి.

ఇక.. ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయగానే చాలామంది సినిమా సెలబ్రిటీలు స్పందించారు. ఈ సినిమాతో ప్రభాస్ ఖచ్చితంగా హాలీవుడ్ స్టార్ అవుతాడని తన పెదనాన్న కృష్ణంరాజు కొనియాడారు.

ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించినా… ప్రభాస్ ఈ రేంజ్ కు రావడానికి కారణమైన బాహుబలి డైరెక్టర్ రాజమౌళి స్పందించడం స్పెషల్ ఇక్కడ.

A-ఆదిపురుష్ సినిమాను ప్రభాస్ అనౌన్స్ చేసిన తర్వాత.. రాజమౌళి ప్రభాస్ కు ఫోన్ చేశారట. ఈసినిమాను ప్రభాస్ ఒప్పుకోవడంతో ఎంతో ఖుషి అయ్యారట రాజమౌళి. రామాయణ ఇతిహాసంలో తనకు ఇష్టమైన రాముడి పాత్రను ప్రభాస్ ధరిస్తున్నందుకు చాలా సంతోషించి.. ప్రభాస్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు రాజమౌళి. రాజమౌళి ఫోన్ చేసి అభినందించినందుకు ప్రభాస్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాడట.