మహేష్ తో నటించే అవకాశం వస్తే నేనేందుకు వదులుకుంటాను

Raashi Khanna To Get Shock

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏ కొత్త హీరోయిన్ కి అయినా కూడా సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. అలాగే వాటితో పాటుగా కొన్నాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యాక కూడా ఆ తరహా ప్రశ్నలే ఎదురవుతాయి. మరి ఇప్పుడు తాజాగా ఓ గ్లామరస్ యంగ్ బ్యూటీ రాశీ ఖన్నాకి కూడా రీసెంట్ గా ఓ ప్రశ్న ఎదురయ్యింది.

ఆమె ఓ ఇంటర్వ్యూ లో అటెండ్ కాగా మన తెలుగు సినిమా ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా విషయంలో ఆమె చేసిన కామెంట్స్ కొంచెం ఘాటుగానే అనిపించినట్టు ఉన్నాయి. ఈ ప్రశ్న రాగా తనని చాలా మంది అభిమానులు మహేష్ బాబు తో సినిమా ఎందుకు చేయట్లేదని అడుగుతూ ఉండేవారని చెప్పుకొచ్చింది.

మరి దానికి సమాధానంగా తాను నాకు మహేష్ తో నటించే అవకాశం వస్తే నేనేందుకు వదులుకుంటాను, ముందు అవకాశం రావాలి కదా అని తేల్చి చెప్పేసింది. అయితే ఇది అలా అడిగిన వారి విషయంలో విస్తు పోయి చెప్పినట్టు అనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి అయితే మహేష్ తో సినిమా చెయ్యాలని తాను కూడా ఆరాటంగానే ఉంది.

మరి ఆ కాంబో సెట్ చేసే టైం, దర్శకుడు కూడా సెట్టవ్వలి కదా మరి అప్పుడు తన సమాధానం లోని పాయింట్ ఉంది. మరి ఈ కాంబో ఎప్పుడు పడుతుందో చూడాలి. ఇక ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా నాగ చైతన్య హీరోగా చేసింది “థ్యాంక్ యూ” ఈ జూలై 22న రిలీజ్ కాబోతుంది.