Pushpa Movie: ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అంటూ సోషల్ మీడియాని ఉలిక్కిపడేలా చేసింది సమంత సిజిలింగ్ సాంగ్. రిలీజ్ అయినా కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ని దుమ్మురేపి దంచికొట్టింది. పుష్ప మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు సమంత చేసిన ఐటమ్ సాంగ్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ పాట కోసం మేకర్స్ దాదాపుగా 5 కోట్లని ఖర్చుపెట్టారని తెలుస్తుంది.
ఈ ఒక్క పాట కోసం సమంత కి దాదాపుగా కోటిన్నరకి పైగా పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఈ పాట కోసం భారీ సెట్టింగ్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించారు . పుష్ప సినిమాలోని ఈ పాట మూవీ కే హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. యూట్యూబ్ లో దాదాపుగా 45 మిలియన్లకి పైగానే వ్యూస్ సంపాదించి ట్రెండింగ్ లో నిలిచింది.