ఈ కాంబినేషన్ కావాల‌ని పూరీ ఫాన్స్ ఎప్పటినుంచో గొడవ చేస్తున్నారు.. ఇప్పటికీ ఫైనల్ అయ్యింది !

రామ్ – పూరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రి కెరీర్ లోనూ ఇస్మార్ట్ హిట్ ఇది. అందుకే ఈ కాంబో అప్ప‌ట్లోనే సీక్వెల్ సినిమాని ప్ర‌క‌టించేసారు. క‌చ్ఛితంగా సీక్వెల్ స్క్రిప్టు రెడీ అవుతుంద‌ని పూరి అభిమానుల‌కు మాటిచ్చారు. పూరి రెడీ అయితే తాను సిద్ధ‌మేన‌ని రామ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

puri fans waiting for this combination movie

ఎట్ట‌కేల‌కు ఈ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంద‌న్న తాజా లీక్ అందింది. ఈ కాంబో సీక్వెల్ కి అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రామ్ కోసం పూరి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ పూర్త‌యింది. అయితే ఆ ఇద్ద‌రూ క‌లుసుకుని చ‌ర్చించాల్సి ఉంది. 2021 సమ్మర్ చివరిలో సెట్స్ కెళ్లి.. అదే ఏడాదిలోనే విడుదల చేస్తారు.

దేవ‌ర‌కొండ‌తో పూరి ఫైట‌ర్ శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌నుకున్నా క్రైసిస్ వ‌ల్ల ఆల‌స్య‌మైంది. ఇది పూర్తి చేసాక ఇస్మార్ట్ శంక‌ర్ స్క్రిప్టును ఫైన‌ల్ చేసి రామ్ కి వినిపిస్తాడు. అప్ప‌టికి రామ్ కూడా ఇత‌ర సినిమాల్ని పూర్తి చేసి రెడీ అవుతాడు. పూరి – రామ్ అంటేనే ప‌క్కా ఊర‌మాస్. మ‌రోసారి అలాంటి ఎన‌ర్జిటిక్ స్క్రిప్టుతోనే సెట్స్ కెళ‌తార‌న‌డంలో సందేహ‌మేం లేదు. ఈసారి డ‌బుల్ ఇస్మార్ట్ శంక‌ర్ అంటూ డ‌బుల్ ట్రీటిస్తారేమో చూడాలి. ఈ కాంబినేషన్ కావాల‌ని పూరీ ఫాన్స్ ఎప్పటినుంచో గొడవ చేస్తున్నారు.. ఇప్పటికీ ఫైనల్ అయ్యిందనుకోవ‌చ్చ‌న్నమాట‌.